
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ బస్టాపు వద్ద కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో తృటిలో భారీ ప్రాణాపాయం తప్పింది. టీజీ 03 0473 నంబర్ గల కియా కారు కరీంనగర్ వైపు నుండి తుమ్మలపల్లి గ్రామంలోకి కుడివైపు తిరుగుతుండగా హుజురాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న టీఎస్ 02 ఎఫ్ జె 0121 నెంబర్ గల టాటా కారు కియో వెనుక భాగంలోని టైర్ కు ఢీకొట్టడంతో టాటా కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై బెలూన్లు తేర్చుకున్నాయి. హుజురాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి మూల తిరుగుతుండగా కియో కారు వెనక డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొట్టడంతో టైరు బెండ్ అయి ధ్వంసం అయింది. అదే రాపిడితో డీజిల్ ట్యాంకు పగిలిన లేదా కారు బోల్తా పడిన రెండు కార్లల్లో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై ఇరువురు వాహనదారులు చర్చించుకుని నష్టపరిహారం చెల్లించుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది.


