
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో ఆదివారం పదవ తరగతి పిల్లల వీడ్కోలు వేడుకలు ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య మాట్లాడుతూ…జీవితంలో కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటామని, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత స్థాయిలో చూడాలని చాలా కష్టపడి చదివిపిస్తున్నారని అన్నారు. వాళ్ళ కష్టానికి మీ మార్కులతో బదులు ఇవ్వాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ… ప్రణాళిక బద్ధంగా చదివిస్తూ వారిలో పరీక్షలంటే భయం అన్నది లేకుండా చేస్తున్నామని అన్నారు. క్రమశిక్షణతో ఉన్న పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దాసరి తిరుపతియాదవ్, ప్రిన్సిపల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


