
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 16 నుండి 18 వరకు హుజురాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొనే సీనియర్ క్రీడాకారులను ఆదివారం హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా నుండి 40 మంది క్రీడాకారులు ఎంపిక కోసం రాగ వారిలో 18 మందిని జిల్లా టీం కోసం జిల్లా హాకీ క్లబ్ కార్యదర్శి సర్ధార్ సురేందేర్ సింగ్ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ క్లబ్ శాశ్వత అధ్యక్షులు తోట రాజేంద్ర ప్రసాద్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి గణిశెట్టి ఉమామహేశ్వర్, ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, సీనియర్ హాకీ క్రీడాకారులు గుడ్డేలుగుల స్మమయ్య, పిఈటి సాధుల శ్యాం, బోడిగే తిరుపతి, కోచ్ తిరుణహరి శ్రీనివాస్, వినయ్ విక్రం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
