
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండపాక శ్రీనివాస్ సరోజన దంపతుల కుమార్తె రోహిణి వివాహం బిఆర్ఎస్ నాయకుడు దరుగుల రాకేష్ తో హుజురాబాద్ పట్టణంలోని బిఎస్సార్ గార్డెన్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు, వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులు, పలువురు పుర ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.



