
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 24 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా పోటీలో ఉన్నారు. అయితే రెండో రౌండ్ కౌంటింగ్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి – 14,690, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి- 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి – 10,746 రాగా రెండవ రౌండ్ మూగిసేసరికి బిజెపి లీడ్. 1492 ఓట్లతో ముందంజలో ఉంది. కాగా మొత్తం 3.55 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లలో 2,50,106 ఓట్లు పోలయ్యాయి, ఇందులో 40,000 పైగా ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోంది, ఇది పూర్తి కావడానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతుందని అంచనా. కౌంటింగ్ కోసం 800 మంది సిబ్బందిని నియమించినప్పటికీ, లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం, కలెక్టర్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
