
–ఆర్థిక సహాయం అందించిన తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మార్చి 4:
ఇటీవల అనారోగ్యంతో ఓ చిరు వ్యాపారి మృతి చెందగా.. మానవతాదృక్పథంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి ఆదర్శంగా నిలిచారు. హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డు (పాపారావు బొంద స్థలంలో) చిరు వ్యాపారం చేస్తున్న తోట సత్యనారాయణ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి భార్య సుశీల, కుమారుడు ఉన్నారు. సత్యనారాయణ మృతి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబానికి అండగా నేనున్నా అనే భరోసా ఇచ్చారు. రూ. ఐదు వేలు నగదు, బియ్యం బస్తాను వారికి అందించారు. వార్డులో చిరు వ్యాపారం చేస్తున్న సుశీలకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది. వారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిన మాజీ కౌన్సిలరు కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. పాపారావు బొందలో చిరు వ్యాపారులు కౌన్సిలర్ అందించిన చేయుతను ప్రశంసించారు. తమలో ఒక్కరిగా ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ బాధితులకు అండగా ఎల్లప్పుడూ నిలుస్తున్న లావణ్య నర్సింహారెడ్డిని వార్డు ప్రజలు, వ్యాపారులు అభినందించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తున్న కౌన్సిలర్ దంపతులను 26వ వార్డ్ ఓటర్లు మళ్లీ తమ మద్దతు వారికే నంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

