
కుమార్ యాదవ్, స్వర్ణోదయం జమ్మికుంట రిపోర్టర్, మార్చి 4: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో 32వ వార్షికోత్సవ సంబరాలు మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యోదయ పాఠశాల డైరెక్టర్ జ్యోతి, డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్, అకాడమిక్ డైరెక్టర్ మహాలక్ష్మి నిర్వహణ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జమ్మికుంట పట్టణ సిఐ వరంగంటి రవి, జమ్మికుంట మండల విద్యాధికారిని వేముగంటి హేమలత ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యోదయ స్కూల్ వ్యవస్థాపకుడైన కీ.శే.లు యేబూషి రామస్వామిని గుర్తుకు తెచ్చుకున్నారు. వారి ఇరువరి మధ్య ఉన్న స్నేహ సంబంధాన్ని, రామస్వామి చేసిన కృషిని, కష్టాన్ని, సేవలను, పాఠశాల నిర్వాణ గురించి వివరించారు. తదనంతరం
జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరంగంటి రవి మాట్లాడుతూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఉద్దేశించి, చదువు గొప్పతనాన్ని విద్యార్థి చేయవలసిన మంచిని గురించి, చెడు మార్గాలను ఎంచుకోకుండా సవ్యమైన జీవితాన్ని గడపాలని అన్నారు. ఇతరులకు మార్గదర్శిగా ఉండాలని ప్రసంగించారు. భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. మండల విద్యాధికారిని వేముగంటి హేమలత మాట్లాడుతు చదువు గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించింది. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని, అన్ని రంగాల్లో రాణించాలని, దానికి మీ కృషి ఎంతో అవసరం అని విద్యార్థులకు ఉపదేశించి, పాఠశాల యాజమాన్యం మీ అందరికీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించింది అన్నారు. విద్యోదయ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా మీతో కష్టపడినందుకు, మీరు మంచి మార్కులు సాధించి, విద్యోదయ పాఠశాలకు, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకరావాలని కోరుకున్నారు.
విద్యోదయ పాఠశాల డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్, తన తండ్రి అయిన రామస్వామి 45 మంది విద్యార్థులతో ప్రారంభించి, 3500 మంది విద్యార్థులుగా అభివృద్ధి చెందుతూ, ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి, విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారనే విషయాలను గుర్తు చేశారు. తల్లిదండ్రుల సహాయ సహకారాలు, విద్యాభిమానుల, శ్రేయోభిలాషుల ఆశీస్సులు తనకుంటే తండ్రి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలోనూ, అహర్నిశలు శ్రమిస్తానని, రామస్వామి లేని లోటును తీర్చలేక పోవచ్చు, కానీ తన వంతు కృషి చేస్తానని, తల్లిదండ్రులకు విన్నవించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆటలపోటీలు, క్విజ్ పోటీలు వంటి రకరకాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. విద్యార్థిని, విద్యార్థుల నాటకాలు, సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను ఎంతో గానో ఆకర్షించాయి. తదునంతర కార్యక్రమంలో తొమ్మిదోవ తరగతి విద్యార్థులు పదోవ తరగతి విద్యార్థులకు వీడ్కో ల్పు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




