
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసముంటున్న కల్పన, రెండు రోజులుగా డోర్ ఓపెన్ చేయలేదంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన అపార్ట్మెంట్ వాసులు. తలుపులు పగలగొట్టి అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం కేసులో విచారణ.
గత రెండు రోజులుగా బయటికి వెళ్లిన అని చెప్తున్నా సింగర్ భర్త, నిద్ర మాత్రం మింగి ఆత్మహత్నం చేసిన సింగర్ కల్పన రెండు రోజులగా ఇంటిలోనే ఉండిపోయింది. అయితే కల్పన భర్త పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే కల్పన భర్త ఆసుపత్రికి చేరుకున్నారు. కల్పన భర్తను పోలీసులు తీసుకొని ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. అలాగే కల్పన ఇంట్లో మరొకసారి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక పలు అనుమానాలు రేకెత్తిస్తుండగా కల్పన భర్త మాత్రం రెండు రోజులుగా తాను బయటికి వెళ్లనని చెప్పడం ఆయనపై అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా అప్పటికి పోలీసుల సమగ్ర విచారణలో పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు తెలిసింది.


వీల్ చైర్ లో ఆసుపత్రికి సింగర్ కల్పనను తరలిస్తున్న పోలీసులు