
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, (సైదాపూర్) మార్చి5: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం అర్చకులు శేషం వెంకట రమణాచార్యులు, యజ్ఞాచార్యులు నవ్యానందాచార్యులు, పురుషోత్తమాచార్యులు, మణికంఠాచార్యులు, మనోహరాచార్యులు, శేషం మాధవాచార్యులు, అఖిల్ ఆచార్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, గజస్తంభ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొనపాటి రామ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

