
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఈరోజు సాయంత్రం రంజాన్ ఇఫ్తార్ విందు మక్కా మసీద్ ముస్లిం సోదరులు ఏర్పాటు చేయాగా ఈ ఇఫ్తార్ విందులో హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్ తో పాటు సయ్యద్ సలీం, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ బాసుమియా, మహమ్మద్ మదార్, మహమ్మద్ బ్రదర్, మహమ్మద్ సోహెల్ తో పాటు ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక నెల రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరు ఉపవాసాలు ఉంటారని, ఐదు పూటలా నమాజు తో పాటు ఖురాన్ చదువుకుంటూ చాలామంది ముస్లిం సోదరులు మసీదులలో ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నారు. ఉదయం పూట నాలుగు గంటలకు సహర్ చేస్తారని, సాయంత్రం 6:30 గంటలకు ఇఫ్తార్ ఉపవాసం విడిచినప్పుడు ఖర్జూర, ద్రాక్ష పండు, అరటిపండు, దోసకాయ, అనారాజ్ ధాన్య పండు కర్బూజ్ తర్బూజ్ ఇలాంటి పండ్లు తిని నీళ్లు తాగి ఉపవాసం విడుచుతారన్నారు. ఈ ఒక్క రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో హిందూ ముస్లింలు భాయ్ భాయ్ గా గంగా జమున తహసిప్ పాటిస్తారన్నారు. ఒకరోజు ముందే ఇస్లాంనగర్ కు చెందిన ముస్లిం సోదరులకు హుజురాబాద్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అందరూ ముస్లిం సోదరులకు భోజన కార్యక్రమం కాకతీయ కాలేజ్ ఆవరణంలో మక్కా మసీద్ ముస్లిం సోదరులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. దీనిలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారని హుజురాబాద్ మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ అజీమ్, సయ్యద్ సలీం తెలిపారు.


ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ముస్లిం మత పెద్దలు..