
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, మార్కెట్ డైరెక్టర్స్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురి లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి, నియోజకవర్గ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, బొల్లం రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మిట్టపల్లి సుభాష్, గ్రామ శాఖ అధ్యక్షులు సముద్రాల రమేష్, మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, గట్టు శ్రీధర్ గౌడ్, కిన్నెర కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణుదాసు వంశీధర్ రావు, నాంపల్లి ప్రభాకర్, గూడెపు మొగిలయ్య, ఇస్తారి, ఇజిగిరి దేవేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు దర్ముల శ్రీకాంత్, ఆసిఫ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




