
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంటరోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న ఓ పాఠశాల గోడను ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ ఢీకొన్న వేగానికి గోడ పిల్లర్ సైతం విరిగిపోయింది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి కింద పడ్డారు. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న యాకూబ్ కు తీవ్ర గాయాలు కాగా ముజాహిద్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే యాకుబును 108 లో ప్రధమ చికిత్స అనంతరం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
