
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని పీహెచ్సీలో శుక్రవారం జాతీయ జనౌషది దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ…ప్రతి సంవత్సరము పిఎం భారతీయ జనౌషధి పరియోజన కార్యక్రమం కింద జానౌసిది దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. జనరిక్ మందులు అత్యంత నాణ్యమైనవని చౌక ధరలో దొరుకు తాయని దేశమంతా జనోది మందుల దుకాణాలు ఉన్నాయని వాటిని వినియోగించాలని అన్నారు. ఈ మందులు బ్రాండెడ్ మందుల కంటే 50 అరవై శాతం తక్కువగా లభ్యం అవుతాయని ఆరోగ్య భద్రతకు ఆరోగ్య పరిరక్షణకు చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలందరూ జనరిక్ మందులను వాడటాన్ని అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మధు జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, ఎంపీహెచ్వో విజయేందర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

