
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట నుండి కరీంనగర్ వెళ్తున్న బస్సులో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో బస్సులో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. సదరు వ్యక్తి మృతిని కరీంనగర్ వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్. మృతుడు కరీంనగర్ ఐసిఐసిఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వీనవంక మండలం రెడ్డుపల్లి గ్రామానికి చెందిన ఓదెలుగా గుర్తించారు.
