
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్గా సేవలు అందించిన అభిషేక్ మహంతి బదిలీ కావడంతో, ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనను సత్కరించి, సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా మహంతిని గజమాలతో సత్కరించి ఆయన కృషిని కొనియాడారు. పోలీసు శాఖలో బదిలీలు సాధారణమైనవి కానప్పటికీ, అభిషేక్ మహంతి తన పదవీకాలంలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేశారని అధికారులు తెలిపారు. అభిషేక్ మహంతి నాయకత్వంలో పోలీసు శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసింది. నేర నియంత్రణ, ప్రజలకు న్యాయం అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని సహచరులు ప్రశంసించారు. తన బాధ్యతల్ని నిబద్ధతతో నిర్వహించిన మహంతి కరీంనగర్ పట్టణ అభివృద్ధికి తన వంతు సేవలను అందించారని అధికారులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డిసిపి మొదలుకొని సీఐల వరకు జిల్లాకు చెందిన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
