
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ వారు నిర్వహించిన మూడు లెవల్ లో నిర్వహించిన ప్రామాణిక పరీక్షల్లో పోటీపడి జమ్మికుంట సెయింట్ జోసెఫ్ స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని నిహా తన్నజ్ స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. ఇదే స్కూల్ కు చెందిన 7వ తరగతి విద్యార్థిని కే విశ్వశ్రీ జోనల్ లెవల్ లో 9వ ర్యాంక్ సాధించింది. ఎయిమ్స్ ఒలంపియాడ్ హంట్ ఫైనల్ విన్నర్లుగా నిలిచిన వీరికి ఈ రోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం చేసి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కడియాల ప్రభాకర్ రావు, గుడ్ షెఫర్డ్ అండ్ యూనిక్ చిల్డ్రన్ కేర్ వ్యవస్థాపకులు ఎండి ఖలీముల్లాఖాన్ పాల్గొని విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సేవనందించే మీరు ఉన్నత విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ ఇష్టపడి చదవాలని మీకు, మీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా సెయింట్ జో స్కూల్ కరస్పాండెంట్ వై సునీల్, ప్రిన్సిపల్ వేణుగోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

