
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణానికి చెందిన సామాజికవేత్త, టిజిఎస్ఆర్ టిసి అరుకాల రవీందర్ కండక్టర్ గా పనిచేస్తున్న రవీందర్ సామాజిక సేవలను గుర్తించి వీరిని మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ పక్షాన జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారానికి ఎంపిక చేసీ ఈ పురస్కారాన్ని తన పదవి విరమణ సందర్భమును పురస్కరించుకొని ఆదివారం రాంపూర్ లోని న్యూ శ్రీనగర్ కాలనీ2 తన నివాస ఆవరణ పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. సామాజికవేత్త అరుకాల రవీందర్ వారి ధర్మపత్ని కవితకు పట్టు శాలువా కప్పి, బొకేను జ్ఞాపికను అందజేసి, జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారంతో ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రజాకవి రచయిత తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యంగౌడ్ మాట్లాడుతూ…సామాజికవేత్తగా తన వంతు సహాయాన్ని ఎందరికో అందజేశారు. అన్యాయాన్ని సహించక, ధైర్య సాహసాలతో అవినీతిని ఎదిరించే దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగుతూ, నీతి నిజాయితీగా బ్రతికే ఒక వ్యక్తిగా శక్తిగా తన పాత్రను పోషించడం గర్వించదగ్గ విషయం అన్నారు. వృత్తిపరంగా ఆర్టీసీ కండక్టర్ గా ఎన్నో సేవలు అందించి వారి పాత్రను పరిపూర్ణంగా పోషించి అందరితో కలిసి మెలిసి ఉండటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్న రవీందర్ సేవలు ఆదర్శప్రాయం అన్నారు. వృత్తి ప్రవృత్తిలో తన వంతు పాత్రను సమర్థవంతంగా, సంపూర్ణంగా ప్రదర్శించి తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విధంగా నిస్వార్థభావంతో ప్రతి ఒక్కరూ సేవా బావ నిలవరుచుకొని మంచి మనిషిగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవుల పరిరక్షణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గుండా శ్రీపాల్ గౌడ్, సభ్యులు దేశబోయిన రవీందర్, సురేందర్, శంకర్, కోటి, భూమయ్య, విశ్రాంత ఉద్యోగస్తులు విద్యావేత్తలు పలువురు ఆర్టీసీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
