
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష్మాజిపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర డబ్ల్యు డబ్ల్యుఎఫ్ నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ బీసీఐ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు మరియు కూలీలకు జీవనోపాదులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా రైతులకు మరియు కూలీలకు కూరగాయల విత్తనాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిఐ ప్రాజెక్టు పి యు రీస్కోపింగ్ క్షేత్ర సిబ్బంది ఈరబోయిన సతీష్ మాట్లాడుతూ పత్తి పంటలో మహిళలకు మరియు కూలీల జీవనపదుల గురించి వివరిస్తూ మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం మరియు గుర్తింపు కల్పించాలని మహిళలకు కావలసిన ఆహారంలో తీసుకోవలసిన పోషక విలువల గురించి వివరించారు మహిళా రైతులు వ్యవసాయ పనులతో పాటు ఇతర జీవనోపాదులపై దృష్టి సాధించాలి మరియు కూలీలు అదనపు ఆదాయం కొరకు వారికి కావలసిన జీవనోపాదుల గురించి వివరించారు నాణ్యమైన పత్తి పంటను పండించడం మరియు బాల కార్మికులు నిర్మూలన బలవంతపు కూలి ఉండకూడదు మరియు కూలీలందరూ స్వేచ్ఛగా పనిచేసుకోవాలని వారి హక్కులపై అవగాహన కల్పించడం జరిగింది రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని సూచనలు ఇవ్వడం జరిగింది. రసాయన పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలు వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సమావేశంలో బీసీఐ ప్రాజెక్ట్ పియు రీ స్కోపింగ్ క్షేత్ర సిబ్బంది ఈరబోయిన సతీష్, కంచం అనిల్, రావుల రాకేష్, మహిళా రైతులు, కూలీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

