
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 16 నుండి హుజురాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ హాకీ క్రీడోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సర్దార్ సురేందర్ సింగ్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల ఏర్పాట్లను ఆయన సందర్శించి పరిశీలించారు. హాకీ క్రీడోత్సవాల సందర్భంగా క్రీడాకారుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన హాకీ క్లబ్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హుజురాబాద్ ప్రాంతం హాకీ కి ముఖ్యమైన ప్రాంతమని, హాకీ అంటే హుజురాబాద్, హుజురాబాద్ అంటే హాకీ అన్న పేరు వచ్చిందన్నారు. హుజురాబాద్ ప్రాంతంలోని క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో హాకీ ఆడి అనేక పథకాలు సాధించారని గుర్తు చేశారు. హుజురాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో క్రీడాకారులు మంచి ప్రతిభను చూపి జిల్లాకు పేరు తేవాలని ఆయన సూచించారు. అనంతరం హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ…రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16, 17, 18 తేదీలలో జరిగే ఈ పోటీలకు క్రీడాకారులకు అన్ని వసతులు అందరి సహకారంతో కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, శాశ్వత అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, ప్రధాన కార్యదర్శి జి ఉమామహేశ్వర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, బి తిరుపతి, తిరునగరి శ్రీనివాస్, ఏం వినయ్, వై రోహన్ తదితరులు పాల్గొన్నారు.
