
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్):సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి కుమారుడైన సంతపురి నిఖిల్ రెడ్డి ఈరోజు ప్రకటించిన గ్రూప్ 2 లో 70 వ ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి హుజురాబాద్ పట్టణంలోని టెట్రా హెడ్రాన్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ హైదరాబాదులోని నారాయణ జూనియర్ కళాశాలలో అలాగే ఇంజనీరింగ్ శ్రీనిధి కళాశాలలో నిఖిల్ పూర్తి చేశాడు. గతంలో గ్రూప్ 4 పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డిటిఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా గ్రూప్ 2లో 70వ ర్యాంకు సాధించడం పట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అతడికి డిప్యూటీ తహసిల్దార్ గా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నిఖిల్ రెడ్డి భవిష్యత్తులో గ్రూప్ 1 కూడా సాధించాలనే లక్ష్యంతో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ రెడ్డి గ్రూప్2 లో మెరుగైన ర్యాంకు సాధించడం పట్ల అతని కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.
