
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో సీనియర్ క్రీడాకారుడు దివంగత మోటాపోతుల రమేష్ స్మారక అర్థం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రస్థాయి 8 ఇంటర్ డిస్టిక్ మెన్ హాకీ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమైన లీగ్ మ్యాచ్లు గ్రూప్ ఎ లో ఉదయం జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి పై కరీంనగర్ జిల్లా జట్టు7-1 తో విజయం సాధించింది. ఖమ్మంపై హైదరాబాద్ టెన్ జీరో తో విజయం సాధించింది. రంగారెడ్డి పై వరంగల్ ఆరు ఒకటి తో గెలుపొందింది. ఖమ్మంపై కరీంనగర్ జిల్లా జట్టు ఆరు రెండుతో విజయం సాధించింది. హైదరాబాద్ పై వరంగల్ జట్టు మూడు రెండు తో విజయం సాధించింది. గ్రూప్ బి లో నల్గొండ పై ఆదిలాబాద్ జట్టు 8 -0 తో విజయం సాధించింది. నిజామాబాద్ పై మెదక్ జట్టు 6-1 తో విజయం సాధించింది. మహబూబ్నగర్ ఆదిలాబాద్ జిల్లా జట్టు తలపడగా చెరో మూడు గోల్స్ చేయడంతో డ్రాగ ముగిసింది. నల్గొండ పై మెదక్ 11-0 తో విజయం సాధించింది. మహబూబ్నగర్ పై నిజాంబాద్ మూడు రెండు తో విజయం సాధించింది. ప్రతి మ్యాచ్లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును ప్రకటించి మెమొంటోను అందించినట్లు టోర్నమెంట్ ఆర్గనైజషన్ సెక్రటరీ తోట రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్, గని శెట్టి ఉమామహేశ్వర్లు తెలిపారు.



