
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చి16: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని హై స్కూల్ క్రీడా మైదానంలో సీనియర్ హాకీ క్రీడాకారుడు మోటపోతుల రమేష్ స్మారక తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ సీనియర్స్ ఇంటర్ డిస్టిక్ హాకీ పోటీలను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..హుజురాబాద్ అంటేనే హాకీ అని, ఈ క్రీడా మైదానం నుండి ఎంతోమంది రాజకీయ నాయకులు బయటికి వచ్చారని సూచించారు. క్రీడలతో నాయకత్వ లక్ష్యాన్ని పెంపొందించు కోవచ్చని, ఎన్నో పరిచయాలు ఏర్పడతాయని క్రీడాకారులకు సూచించారు. హుజురాబాద్ లో ఎన్నో హాకీ టోర్నమెంట్స్ నిర్వహించారని హుజురాబాద్ నుండి ఎంతోమంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించారన్నారు. అనంతరం ఎనిమిదవ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్టిక్ మెన్ హాకీ టోర్నమెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు. జెండా ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ రవీందర్ సింగ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ సెక్రెటరీ గనిశెట్టి ఉమామహేశ్వర్, కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, జిల్లా సెక్రెటరీ సర్దార్ సురేందర్ సింగ్. స్టేట్ జాయింట్ సెక్రెటరీ సర్దార్ కళ్యాణిసింగ్, సీనియర్ క్రీడాకారులు సమ్మయ్య, రవీందర్, చింత శ్రీనివాస్, నల్ల బాలరాజ్, లక్ష్మీనారాయణ, టి శ్రీనివాస్, ఆరెల్లి రమేష్, భూసారపు శంకర్, సాయికృష్ణ, బి తిరుపతి, పిటి శ్యాంసుందర్, ప్రభాకర్, కరీంనగర్ జిల్లా జట్టు కోచ్ మాటూరి రాజేష్, మేనేజర్ మోటాపోతుల వినయ్, రాజేష్, విక్రమ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.










