
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డా. బిఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్ల పై ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూం దాం కార్యక్రమం అంబేడ్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్ తెలిపారు.
ఈ వాల్ పోస్టర్స్ ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందిని, ఈ కార్యక్రమానికి ప్రణవ్ బాబుని తప్పకుండా రావాలని ఆహ్వానించామని రామచ భరత్ తెలిపారు.
ఈ సందర్బంగా రామంచ భరత్ మాట్లాడుతూ 1921లో ఇంప్రియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు “రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం” అనే పుస్తకాన్ని వ్రాసి హెల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల సైమన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది అంబేద్కర్ కృషి వల్ల వారి యొక్క త్యాగాలను వారి చరిత్రను కనుమరుగు చేస్తున్నారన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించినప్పుడే మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అని, ఆత్మగౌరవం వర్దిల్లుతుందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడి కరెన్సీ నోట్లపై ముద్రించుటకు కృషి చేయాలని, మార్చి 10 నుండి జరుగు పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడి కేంద్ర ప్రభుత్వంపై ఓత్తిడి తేవాలి కోరారు.
మార్చి 26న జరుగు ధూం ధాం సభకు రాజ్యసభ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొనాలని అయన కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ అధ్యక్షులు కిరణ్ హుజూరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, కాంగ్రెస్ నాయకులు సుగుణాకర్ రెడ్డి,మిడిదొడ్డి శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


చలో ఢిల్లీ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు…