
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామం(గంటవాడ)లోని గంట లక్ష్మయ్య అనారోగ్యంతో నిన్న సాయంత్రం మరణించగా వారి కుటుంబాన్ని హుజురాబాద్ తాజా మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డితో మాజీ ఎంపీటీసీ సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధవాసుదేవరెడ్డి తదితరులు వెంట ఉన్నారు.
