
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పెద్ద పాపయ్య పల్లి గ్రామంలోని మస్జిద్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాంద్ భాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని మసీద్ సమస్యలు తీరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా అండ్ ఖబ్రస్థన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మున్ను, ఫయాజ్, అశ్వక్, అక్బర్, సల్మాన్, ఇస్మాయిల్, ఇమ్రాన్, సలీం, అజీమ్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.


పెద్దపాపయ్యపల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్.. ముజాహిద్ తదితరులు..