Oplus_131072
–కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా..
-నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్..
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: తెలంగాణ రాష్ట ( ఐఎన్ టియుసిఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐఎన్టి యుసి) అధ్యక్షులుగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, బేతీగల్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా..అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ..నా నియామకానికి కృషి చేసిన కార్మిక సంఘం నాయకులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం ద్వారా అసంఘటిత కార్మికులు మరియు సంఘటిత కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఆయన అన్నారు.






