
–వరంగల్ ప్రెస్ క్లబ్ లో లాంఛనంగా ఐజేయూ సభ్యత్వం ప్రారంభం
–మండలాల వారిగా సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్
–టీయుడబ్ల్యూజె (ఐజేయు) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి(హనుమకొండ) : జర్నలిస్టుల సమస్యల సాధన కోసం టియుడబ్ల్యూజే (ఐజేయు) పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఐజేయు సీనియర్ జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన జిల్లా యూనియన్ నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమం లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే మాత్రమే నని అన్నారు. ఆరు దశాబ్దాల యూనియన్ చరిత్రలో అక్రిడిటేషన్ లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరంతో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించేందుకు పోరాడుతామన్నారు. జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి మాట్లాడుతూ వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సమస్యల సాధనకై జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజేే నిలుస్తుందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల జారి, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీయూడబ్ల్యూజే ( ఐజేయు) యూనియన్ కు మరే యూనియన్ సాటి రాదని గుర్తుచేసిన ఆయన దశాబ్దాల చరిత్ర ఉన్న యూనియన్ పై జర్నలిస్టులకు ఎంతో విశ్వాసం ఉందని వారి విశ్వాసానికి అనుగుణంగా జర్నలిస్టు బాధ్యులుగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా త్వరితగతిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్, వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, పెండెం వేణు మాధవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లాల బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్దన్, వరప్రసాద్, ఎంఏ నయీం, గన్ను సంతోష్, పులికంటి రాజేందర్, ముదిగిరి ఓదెలు, అల్లె రామారావు, ఖాదర్ పాషా, ఎం రాజేంద్రప్రసాద్, రాంమోహన్, బి శ్రీహరిరాజు, కిరణ్ రెడ్డి, దామోదర్, ఎండి ఉస్మాన్ పాషా, తాండూరి గోపి తదితరులు పాల్గొన్నారు.

