
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ చౌరస్తా నుండి తొలగించిన ఇందిరా గాంధీ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరామాలకు రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం ఉండేదని దానిని అప్పటి మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ తొలగించారని తెలిపారు. మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, సీనియర్ నాయకులు సొల్లు దశరథం, మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.


మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు