
Oplus_131072
- 15వ ఆర్థిక సంఘం నిధులకు అర్హత పట్ల హర్షం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సంఘం ఆస్తిపన్నుల వసుళ్లలో టాప్ గా నిలిచింది. దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులకు కూడా అర్హత సాధించింది. ఈ సందర్భంగా శనివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు మిగతా అధికారులు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సుమారు 30 లక్షల రూపాయలు ఎక్కువగా వసూలు జరిగాయని, ఇందుకోసం కృషి చేసిన అధికారుల కృషి భేష్ అన్నారు. ఆస్తి పన్నుల వసూలులో గత సంవత్సరం కంటే 12.09% శాతం ఎక్కువగా 100% పన్నులు వసూలు చేసి, రాష్ట్రంలోనే ఆస్తి పన్నుల వసూలులో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు తద్వారా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పూర్తిస్థాయి అర్హతలు సాధించడం జరిగిందని అన్నారు. గతంలో 2 కోట్ల 64 లక్షలు వసూలు చేయగా, ఆర్థిక సంవత్సరం వారం రోజుల ముందుగానే 100% సాధించి 2 కోట్ల 91 లక్షలు వసులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గందే శ్రీనివాస్, మునిసిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కిషన్ రావు, జవాన్లు ఆర్ సుధీర్, పి రాజు, కుమార్, ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
