
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హుజురాబాద్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా “శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ” వేడుకలను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరుపుకొన్నారు. పూజారి చేత పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఉగాది పచ్చడినీ అందరికీ అందజేశారు. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల మరియు పట్టణ అధ్యక్షులు మరియు మహిళా మండల మరియు పట్టణ అధ్యక్షురాల్లు, సోషల్ మీడియా ఇంచార్జి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

