
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లి శివారులో నెలకొన్న భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం లో పాలక మండలి ఆధ్వర్యంలోఆలయ పూజారి ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు చిట్యాల సంతోష్ పంచాంగ శ్రవణం పటిస్తూ అందరికీ సర్వ శుభాలు చేకూరాలని అన్నారు. జీవితం సకల అనుభూతుల మిశ్రమమని అదే ఉగాది పచ్చడి తెలియ జెప్పే నిజమన్నారు. మామిడి, వేప చెట్లకు పూత పూసి కోయిల గొంతుక పెకిలి, పసిడి బెల్లం తోడు నిలిచి, గుమ్మానికి పచ్చని తోరణం ఉగాది ఉత్తేజానికి ఆశావహ ఉత్తెజానికి, దృక్పథానికి ప్రతీక అని, ఆకులు రాలిన చెట్ల వలె ఆశలను కోల్పోయిన మనుషుల్లో చిగుళ్ళు తొడిగే దైర్యాన్నిచ్చి సర్వ శుభాలు ఈ ఉగాది పండుగ సందర్భంగా భగవంతుడు చేకూర్చాలన్నారు.
ఒక్క ఉగాదే కాకుండా మన పండుగలన్నీ మానసిక బలాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి జీవితాన్ని మరింత సారవంతం చేసేవని పూజారి పఠిస్తూ ఈ ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ముందుగా
ఈ వేడుకలకు హాజరైన ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుకు ఆలయ కమిటీ తరపున రెడ్డి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒగ్గు డోలు కళాకారులు డప్పులు వాయిస్తూ
స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం లో పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర సందర్భంగా ఉమ్మడి జిల్లా, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు పోలాడి రామారావు తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రెడ్డి, రమేష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సాగర్, మహేందర్ పర్ష రాములు, సాయి కుమార్, చుట్టు పక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.



