
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 07ః మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి తులసీ లక్ష్మణమూర్తి ల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవ కరపత్రాన్ని సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అగ్రవర్ణాల నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన జీవితాన్ని ధారబోసి ప్రతిఘటించిన పోరాటయోధుడని అన్నారు. అణగారిన వర్గాల గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉంటాడని పూలే త్యాగాన్ని కొనియాడారు. అలాగే, జ్యోతిబాపూలే స్త్రీ విద్య కొరకు పాటుపడి మొదటి ఉపాధ్యాయురాలిగా తన భార్య సావిత్రిబాయి పూలేను ఈ సమాజానికి అందించి స్త్రీలకు విద్యతో పాటు అన్ని విధాల అభివృద్ధి కొరకు పాటుపడిన మహనీయుడు జ్యోతిబాపూలే అని పేర్కొన్నారు. ఈనెల 11న నిర్వహించే మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మారేపల్లి శ్రీనివాస్, జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మట్టెల ప్రకాష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, హనుమాన్ దేవాలయం కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు, సునీత, ఉప్పు శ్రీనివాస్ పటేల్, జ్యోతిబాపూలే కమిటీ మాజీ అధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్, ప్రజా సంఘాల నాయకులు సందేల వెంకన్న, ఆలేటి రవీందర్, ఆకుల సదానందం, రొంటాల సుమన్, బుర్ర కుమార్, ఎర్రబొజ్జ నారాయణ, చిలుకమారి శ్రీనివాస్, రామ్ సారయ్య, బండారి శ్రీనివాస్, కొలిపాక సారయ్య, ఎండి అప్సర్, మొలుగూరి కొమరయ్య, సాదుల రవీందర్, గోస్కుల మధుకర్, దాట్ల ప్రభాకర్, నడిగోటి రమేష్, కల్వల మల్లయ్య, కామెర లక్ష్మణ్, రావుల రాజేష్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

