
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మధుసుదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు వోడితల సతీష్ కుమార్, నన్నపునేని నరేందర్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్యసాయి గార్డెన్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మధుసూదన చారి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రజిత ఉత్సవ భారీ బహిరంగ సభను కార్యకర్తలు నాయకులు ముందుండి విజయవంతం చేయవలసిందిగా తెలిపారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద ఈనెల 27న జరగబోయే భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది వస్తున్న సందర్భంగా స్థానిక మండల నాయకులు కార్యకర్తలు సభ స్థలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతతో జనం ఉన్నందున సభ భారీ ఎత్తున సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్రం నాలుగు మూలల నుంచి వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సౌకర్యం అన్ని విధాల సౌకర్యాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి మండలం కేంద్రం నుండి అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సభ కోసం భూములు ఇచ్చిన చింతలపల్లి రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, రాష్ట్ర నాయకులు శోభన్ బాబు, సింగిల్ విండో వైస్ చైర్మన్ శేషగిరి, మాజీ ఎంపీపీ తంగేడ శాలిని మహేందర్, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి, మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, మాజీ మండల అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోల్లె మహేందర్, బిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడిశాల వినయ్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత, మండల ప్రధాన కార్యదర్శి జూపాక జడ్సన్, మండల యూత్ ఉపాధ్యక్షులు ఈర కమలాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు చెవుల తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సాతూరి శంకర్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు మదార్, జాగృతి మండల అధ్యక్షులు విక్రమ్ గౌడ్, వోడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, మండల సీనియర్ నాయకులు దేవేందర్రావు, సాంబమూర్తి గౌడ్, రాజేశ్వరరావు, అల్లకొండ రాజు, మొగిలి, వెంకటేష్ యాదవ్, ప్రేమ్ సాగర్ రావు, చదిరం నాగేశ్వర్, వీరస్వామి, కొమురెల్లి, బాబురావు, జంగం రాజు, వేముల సమ్మయ్య, దుగ్యాని సమ్మయ్య, ప్రసాద్, చెవుల కొమురయ్య, కమలాకర్ రావు, సాతూరి చంద్రమౌళి, సతీష్, శివాజీ బాబు, వేముల శ్రీనివాస్, కోరే రాజ్ కుమార్, వలి పాషా, డెంగు రమేష్, మొగిలి, అంబాల రాజ్ కుమార్, స్వామి రావు, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సాంబరాజు, నవీన్ రావు, కొంగ ప్రవీణ్, సతీష్, ఫుట్కూరి కార్తీక్, మురళి, నవీన్, బొంకురి కార్తీక్, రంజిత్ గౌడ్, అనిల్, భగవాన్ గౌడ్, సందెల నరేష్ అంచనగిరి స్వామి, మహిళా నాయకులు క్రిష్ణవేణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
