
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రేస్ పార్టీ సేవాదళ్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నరెడ్ల వినోద్ రెడ్డిని పలువురు సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు రాజునాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, హుజురాబాద్ మండల, గ్రామాల, కాంగ్రేస్ నాయకులు, మండల మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు, వివిధ కాంగ్రేస్ పార్టీ అనుబంధ పార్టీల నాయకులు, కాంగ్రేస్ పార్టీ యూత్ నాయకులు, మరియు కందుగుల గ్రామ అధ్యక్షులు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరెడ్ల వినోద్ రెడ్డి మాట్లాడుతూ తనని సన్మాంచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రణవ్ బాబుకి వినోద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



