
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దళితబందు రెండవ విడత నిధులను వెంటనే మంజురు ప్రక్రియ మొదలుపెట్టలని ఈరోజు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యని కలిసి దళితబందు సాధన సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. గత కొన్నిరోజులుగా అన్ని మండలాలో దళితబందు యూనిట్ వెరిఫికేషన్ చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఒక ఇల్లందకుంట మండలంలో తప్ప ఎక్కడ కూడా వెరిఫికేషన్ మొదలుపెట్టలేదనీ కనుక హుజురాబాద్ టౌన్ లో ఉన్న బాధితులు అయోమయానికి గురవుతున్నారన్నారు. వెంటనే యూనిట్ వెరిఫికేషన్ వేగవంతం చేసి గ్రౌండింగ్ మొదలుపెట్టలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు అకినపల్లి ఆకాష్, శనిగరం తరుణ్, అంబాలా అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
