
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న పాకాల సంజన జిల్లా స్థాయిలో మంగళవారం మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం సాధించడం జరిగింది. ఈ అవార్డును జిల్లాలోని 16 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఈ సందర్బంగా పాకాల సంజనను మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ అనురాధ, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

పాకాల సంజనకు జిల్లా స్థాయిలో మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం అందజేస్తున్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తదితరులు..