
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: లక్షల డప్పులు వేల గొంతుల సాంస్కృతిక కార్యక్రమం కోసం విలువైన సమయం వెచ్చించి ఎంతో శ్రమించిన కళానేతలందరితో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ఆత్మీయ సమావేశం, హైదరాబాద్ శివారులో గల మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామ పరిధిలోని IRA FARMS House లో జరిగింది. ఈ కార్య్రమానికి హుజూరాబాద్ డివిజన్ ఇన్చార్జిగా వ్యవహరించిన శిరీష అకినపల్లి పాల్గొని గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణని శాలువా కప్పి ఘనంగా సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మందకృష్ణ మాదిగకు శాలువా కప్పి సన్మానిస్తున్న శిరీష ఆకినపల్లి..