
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఉద్యోగులు విద్యుత్తు లైనుకు అడ్డం ఉన్న చెట్ల కొమ్మలు కొడుతూ ఉండగా తేనెటీగలు దాడి చేయగా పలువురు విద్యుత్ ఉద్యోగులు గాయపడ్డారు. 132/33kv తాడికల్ ఫీడర్ మీద తుమ్మనపల్లి గ్రామం వద్ద చెట్లు కొడుతుండగా అక్కడ ఉన్న తేనెటీగలు దాడి చేశాయి ఈ దాడిలో foreman తాండ్ర పురుషోత్తం , Li శ్రీనివాస్, ఎల్ ఎం రుద్రారపు స్వామి, ఏఎల్ఎం కే తిరుపతి, గట్టు బళ్ళు, షబ్బీర్, శాంతన్, జి రమేష్ లు గాయపడ్డారు వెంటనే వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి, ఎస్సార్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. కాగా గాయపడ్డ వారిని హుజురాబాద్ డివిజన్ DE లక్ష్మారెడ్డి, ADE శ్రీనివాస్, టౌన్ AE ఏం శ్రీనివాస్ గౌడ్, రూరల్ AE పీ జనార్ధన్, పలువురు ఉద్యోగులు పరామర్శించారు.



