
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ మధుకర్, డాక్టర్ జరీనా లు మాట్లాడుతూ….గర్భిణీలకు, బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరం అన్నారు. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలని ఐరన్ మాత్రలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, హుజురాబాద్ సిడిపిఓ సుగుణ మాట్లాడుతూ…ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటినుండి బిడ్డ రెండు సంవత్సరాల వయసుకు ఎదిగేంతవరకు తల్లి పాలు పట్టించాలని తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలని తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ మేళ, శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ పద్మ, భరత ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు కోలిపాక అంజలి, జ్యోతి రాణి, ఆయా కొలిపాక స్వప్న తదితరులతో పాటు గర్భవతులు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న కమిషనర్ సమ్మయ్య..

పిల్లలకు ఫ్రీ స్కూల్ మేళ నిర్వహిస్తున్న దృశ్యం..

