
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డు శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చింతల నరేష్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ప్రజాశక్తి మేకల తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. రీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ల ఆదేశాల మేరకు చింతల నరేష్ న హుజురాబాద్ పట్టణంలోని 26వ వార్డ్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని మేకల తిరుపతి తెలిపారు. కాగా నరేష్ నియామకం పట్ల 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.



చింతల నరేష్ నియమక పత్రం అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..