
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలో శనివారం(నేడు) ఉదయం 08:30 గంటల నుంచి 10:30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ సబ్ స్టేషన్లో విద్యుత్తు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణం, బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని, ప్రజలు గమనించి సహకరించగలరని కోరారు.
