
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశవ్యాప్త కుల గణన చేపట్టాలని, తెలంగాణ బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పదిహేను రోజులుగా డిల్లీలో పోరాటానికి సంఘీభావంగా శంకరపట్నం మండల కేంద్రంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొంగోని అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు సత్యాగ్రహ దీక్ష చెప్పట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమరి శ్రీనివాస్, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జినుకల లక్ష్మన్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గజవెళ్లి మనోహర్ హాజరయ్యారు.

