
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం జమ్మికుంట రోడ్డులో గల కేఆర్ఎం మల్టీ పర్పస్ school 2009వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి బాల గార్డెన్ హుజురాబాద్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన0 నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అప్పటి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి మరియు అప్పటి ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ గత జ్ఞాపకాలతో పాటుగా తమరి అనుభవాలను పంచుకోవడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉపాధ్యాయ బృందం అదేవిధంగా కరస్పాండెంట్ భావోద్వానికి గురయారూ… విద్యార్థులు ప్రస్తుతం వారి యొక్క ఉన్నతిని గుర్తు చేస్తూ ఆ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను సన్మానించారు.
