
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు జరిగిన హుజురాబాద్ లారీ అసోసియేషన్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా కే రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా (సెక్రటరీగా) ఎండి మాజీద్, వైస్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్, జాయింట్ సెక్రెటరీ గా సయ్యద్ మునిర్, క్యాషియర్ గా ఏం జనార్ధన్ రెడ్డిలు ఎన్నికయ్యారు. లారీ డ్రైవర్ల, క్లీనర్ల సమస్యల పరిష్కారం కోసం తమ పాలకవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు లారీ అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు ఇతర పాలకవర్గ సభ్యులను పూలమాలలు వేసి షాల్వలతో సత్కరించిన లారీ అసోసియేషన్ సభ్యులు..

అధ్యక్షుడిగా ఎన్నికైన కె రాజయ్య..

ప్రధాన కార్యదర్శి ఎన్నికైన ఎండి మాజీద్