
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఏప్రిల్ 14: హుజూరాబాద్ మునిసిపాలిటీ 26వార్డు పరిధిలోని ఇల్లందులవీధిలో ఇటీవలే నిర్మించిన కొత్త సీసీ రోడ్డుకు ఇరువైపులా తాజా మాజీ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహరెడ్డి సొంత ఖర్చులతో 20 పూల కుండీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య సోమవారం వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వీధిలో ఏర్పాటు చేసిన పూలకుండీలను పరిశీలించారు. సిసి రోడ్డుతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సుందరంగా నిర్మించడాన్ని అభినందించారు. హుజూరాబాద్ పట్టణంలో నడి బొడ్డున 26 వార్డు ఉందని, పచ్చదనం, పరిశుభ్రతతో ఎప్పుడూ ఉండే విధంగా ప్రజలు, సిబ్బంది చూసుకోవాలని కోరారు. ప్రతి వార్డులోనూ ఇలాగే మొక్కలు పెంచాలని, పర్యావరణ సమతుల్యాన్ని పాటించాలని అన్నారు. మొక్కలు ఆక్సిజన్ అందిస్తాయని, పట్టణంలోని అన్ని వీధుల్లో ఇరువైపులా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు ఆక్సిజన్ అందించడమే గాక ఎండాకాలం చల్లదనాన్ని ఇస్తాయని అన్నారు. అనంతరం కమిషనర్ కే సమ్మయ్య దంపతులు వీధిలోని మహిళలకు పూల మొక్కలు అందచేశారు. వర్షకాలంలో ఇంటింటికి మొక్కల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, సూపర్ వైజర్ ప్రతాప రాజు, ఇల్లందుల వీధికి చెందిన శివకుమార్, నాగేశ్వర్ రావు, భిక్షపతి, సంజీవ్ రావు, కుమారస్వామి, మోహన్, తిరుపతి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.










ఇల్లందులవాడలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పూల కుండీలను ఏర్పాటు చేస్తున్న తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య నరసింహారెడ్డి..