
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో సోమవారం జూపాక ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు ప్రభుత్వము నిర్ణయించిన నియమ నిబంధనల ప్రకారం ధాన్యంను కొనుగోలు కేంద్రాన్ని తీసుకురావాలని సింగిల విండో చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రేడ్ కు ₹2320, బి గ్రేడ్ కు 2300 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలకు రూ.500 బోనస్ సైతం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు ఆనుమాన్ల శ్యామ్ సుందర్ రెడ్డి, అధికారులు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

