
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువతరం కృషి చేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుముఖ ప్రజ్ఞవేత్త, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి హుజురాబాద్ ఆర్డిఓ సిహెచ్ రమేష్ బాబు, హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు మారపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే మల్లయ్య, మిడిదొడ్డి శ్రీనివాస్ లు వివిధ ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన జయంతోత్సవ సభలో పలువురు మాట్లాడుతూ…దేశంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపిన వ్యక్తి ఆని, నవభారత రాజ్యాంగ నిర్మాత అకుంఠిత దీక్షాపరులు నిరంతర అన్వేషి అంబేద్కర్ మన దేశ అభివృద్ధి కోసం సర్వజాతుల సమన్వత అభివృద్ధి కోసం నిరంతరం ఆకాంక్షించాడని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ మన అందరి దయంగా ఉండాలని, కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతుల రోజునే కాకుండా మిగతా రోజుల్లో కూడా అంబేద్కర్ సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్రావు, జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, సొల్లు బాబు, రుద్రారపు రామచంద్రం, వేల్పుల రత్నం, ఆలేటి రవీందర్, పాక సతీష్, వై పుష్పలత, మారేపల్లి సుశీల, అక్కినపల్లి శిరీష, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయత రాములు, పోలాడి రామారావు, ముక్కెర రాజు, ప్రకాష్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, వేల్పుల ప్రభాకర్, ఎండి కాలీదు హుస్సేన్, మోరే మధు, శ్రీధర్, మార్తా రవీందర్, నరెడ్ల వినోద్ రెడ్డి పలువురు ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
– పలుచోట్ల అంబేద్కర్ జయంతి వేడుకలు
హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో, విద్యుత్ కార్యాలయంలో, కోర్టు ఆవరణలో, బస్ డిపో, బస్టాండ్ ఆవరణలో, చెల్పూర్, పోతిరెడ్డిపేట, బోర్నపల్లి, తుమ్మనపల్లి తదితర గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఆర్టీసీ డిఎం రవీంద్రనాథ్, టీఎస్ సింగ్, టిఐ2 సారయ్య, అశోక్ బాబు, మారేపల్లి సంజీవరావు, రావుల భూపాల్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


చేల్పూర్ గ్రామంలో…

హుజురాబాద్ లో…

హుజురాబాద్ పట్టణంలో…



అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడు మారపల్లి శ్రీనివాస్, కార్యదర్శి మల్లయ్య, బండ శ్రీనివాస్ తదితర నాయకులు..