
- హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుంది – ఎన్ని కేసులు పెట్టినా సిద్ధం
– హిరంగ సభతో కాంగ్రెస్కు ప్రజల నుండి గట్టి గుణపాఠం చెప్పాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హుజూరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల కంటే హుజూరాబాద్ నుంచే అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా చాటిపెట్టాలి,’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మించి ప్రజలను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కానీ 16 నెలలు గడిచినా ఒక్క హామీ పూర్తిగా అమలవలేదు. ‘‘ప్రభుత్వ హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాను, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగలను,’’ అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతులకు న్యాయం జరగట్లేదని, రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తోందన్నారు. ‘‘కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడిన రైతులను ఈ ప్రభుత్వం విస్మరించింది,’’ అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబతారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితర నేతలు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ విజయవంతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.




