
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో సామాజిక, పర్యావరణ పట్ల అవగాహన కలిగించే నిమిత్తం జి.ప.ఉ.పా.సింగాపూర్ ప్రధానోపాధ్యాయులు భూపతి శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, ఉపాద్యాయుల ఆధ్వర్యంలో విత్తన బంతులు చేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత ను ఉద్దేశించి విద్యార్థులు, ఉపాద్యాయులు, ప్రదానోపాధ్యాయులు తమ సందేశo ద్వారా విద్యార్థులను చైతన్య పరిచారు. ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పని సరిగా వారి మరియు వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్బంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త మొక్కను నాటి వాటిని పరిరక్షించుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సీనియర్ ఉపాద్యాయులు రాంప్రసాద్, మచ్చ పవన్, కిషన్ రెడ్డి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

