
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ పట్టణం లోని ప్రతాపవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో HM పంజాల జ్యోతిరాణి అధ్యక్షతన నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్(PTM)కి ఆకస్మికంగా హాజరై పిల్లలు సాధించిన వార్షిక ప్రగతి (ప్రోగ్రెస్ రిపోర్ట్స్) ని పరిశీలించి మాట్లాడారు.
ప్రతీ నెల జరిగే PTMకి హాజరై మీ పిల్లల ప్రగతి ఎలా ఉందో టీచర్స్ ని అడగాలన్నారు. పై తరగతి విద్యార్థుల దగ్గిర NT బుక్స్ చిన్న తరగతులకు ఇప్పించి వేసవి సెలవులలో వాట్సాప్ గ్రూప్ తో రోజూ ఒక్క పేజీ తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు exercises చేయించాలని టీచర్స్ ని కోరారు. ఎండలో ఏ ఒక్క పిల్లవాడు బయటికి ఆడుకోవడానికి కూడా వెళ్లోద్దని, ఇంట్లోనే తల్లిదండ్రులు కొత్త విషయాలని, తాము చేస్తున్న పనులను పిల్లలకు నేర్పిస్తూ.. రోజంతా వారితో గడపాలన్నారు. next year strength పెంచాలని, పిల్లలకు ప్రతీ విషయం నేర్పించడానికే నిష్ణాతులైన మా టీచర్స్ ఉన్నారని తెలిపి.. పాఠశాల paintingతో ఇంకా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. బర్త్డే జరుపుకుంటున్న 3ʳᵈ class Koduri srinanadanకి ఆశీస్సులు అందించారు. వారి తల్లిదండ్రులు మిగతా పిల్లలకు స్వీట్స్, మంచి రుచికర భోజనం అందించినందుకు అభినందించారు. కార్యక్రమంలో
తల్లిదండ్రులు, టీచర్స్ ముషం సత్యారాజం, భాణాల రవీందర్ రెడ్డి, CRP రంగు దామోదరాచారి పాల్గొన్నారు.

మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైన మండల విద్యాధికారి శ్రీనివాస్